మెగా జాబ్ మేళాతో నిరుద్యోగ యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు :జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
3,200 ఖాళీల భర్తీ లక్ష్యంగా మెగా జాబ్ మేళా నవగీతం,ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మెగా జాబ్ మేళాను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశమై మే 4న నిర్వహించనున్న జాబ్ మేళా నిర్వహణపై అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్షించారు. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు నైపుణ్యాలు పెంపొందించి ఉపాధి అవకాశాలు...