navageetam.com
Newspaper Banner
Date of Publish : 04 April 2026, 8:39 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మెట్ పల్లి మున్సిపల్ కార్మిక సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవం

నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి:

మెట్ పల్లి పట్టణ మున్సిపల్ కార్మిక సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్మికుల ఐక్యతను చాటుతూ జరిగిన ఈ ఎన్నికలో సంఘం అధ్యక్షునిగా లంక శ్రీకాంత్, ఉపాధ్యక్షుడిగా ఉల్లెందుల శ్రీనివాస్, కార్యదర్శిగా ఏ. అనిల్, క్యాషియర్‌గా లంక సంజీవ్ ఎన్నికయ్యారు. అలాగే సలహాదారులుగా వాల్గోట్ నరేష్, పానుగంటి గంగాధర్, షకీల్‌లను నియమించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ నాయకుడు ఉస్మాన్ మాట్లాడుతూ.. నూతన కార్యవర్గం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, వారి సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కమిటీ సభ్యులను పలువురు కార్మిక నాయకులు, పట్టణ ప్రముఖులు అభినందించగా, తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.