యువతలో క్రీడాస్ఫూర్తి పెంపు – వేసవి టోర్నమెంట్లకు వొడ్నాల రాజు చేయూత
నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి: కొడిమ్యాల మండలం తీర్మాలాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు, యువతా సంక్షేమ కార్యకర్త వొడ్నాల రాజు వేసవి కాలంలో జరుగుతున్న మండల, జిల్లా స్థాయి క్రీడా టోర్నమెంట్లకు మద్దతుగా ముందుకు వచ్చారు.యువతలో క్రీడలపై ఆసక్తి పెంపొందించేందుకు 22 టీ-షర్ట్‌లను స్పాన్సర్ చేశారు. ఈ టీ-షర్ట్‌లు పోటీల్లో పాల్గొనే యువకులకు యూనిఫాం రూపంలో అందించనున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల వైపు మళ్లాలని ఆకాంక్షించారు. మొబైల్, సోషల్ మీడియా, మద్యం, మత్తు పదార్థాల ప్రభావాల...