navageetam.com
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 1:36 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

రక్తదానం చేసిన వైశాలి వెల్నెస్ సెంటర్ నిర్వాహకులు

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి :

మెట్ పల్లి పట్టణానికి చెందిన వైశాలి వెల్నెస్ సెంటర్ నిర్వాహకులు మానె సంతోష్ మంగళవారం రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు జన్మదినం పురస్కరించుకొని పట్టణంలోని రాద్న్యా బ్లడ్ బ్యాంక్ లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అత్యవసర సమయంలో ఎవరికైనా రక్తం అవసరం ఉంటే అందుబాటులో ఉన్నవారు రక్తదానం చేయాలని సూచించారు. అంతేకాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తమ నిర్వహిస్తున్న వైశాలి వెల్నెస్ సెంటర్ ను సంప్రదించాలని కోరారు. తమ కేంద్రంలో ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం అందించడానికి న్యూట్రిషన్ తో పాటు పలు ఆరోగ్య సలహాలు సూచనలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని కోరారు. మరిన్ని వివరాలకు 9640169098లో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర నిర్వాహకులు మానె శ్రీలత, వైష్ణవి, బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.