రక్తదానం చేసిన వైశాలి వెల్నెస్ సెంటర్ నిర్వాహకులు
నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి : మెట్ పల్లి పట్టణానికి చెందిన వైశాలి వెల్నెస్ సెంటర్ నిర్వాహకులు మానె సంతోష్ మంగళవారం రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు జన్మదినం పురస్కరించుకొని పట్టణంలోని రాద్న్యా బ్లడ్ బ్యాంక్ లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అత్యవసర సమయంలో ఎవరికైనా రక్తం అవసరం ఉంటే అందుబాటులో...