navageetam.com
Newspaper Banner
Date of Publish : 12 April 2026, 1:34 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

రవీంద్ర భారతిలో గద్వాల సోమన్న “తంగేడు పూలు” పుస్తకావిష్కరణ

నవగీతం,హైదరాబాద్:

కర్నూలు జిల్లా నందవరం మండలం నాగలదిన్నెలో జడ్పీహెచ్ స్కూల్ లో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కార గ్రహీత, బాలబంధు గద్వాల సోమన్న విరచిత “తంగేడు పూలు” పుస్తకావిష్కరణ ఆదివారం రవీంద్ర భారతిలో కాప్రా మల్కాజగిరి కవుల వేదిక ద్వితీయ వార్షికోత్సవ సమావేశంలో ఘనంగా జరిగింది. సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి,ప్రముఖ పద్య కవి రాధశ్రీ, కళాపోషకులు విశ్రాంత అటవీ శాఖ అధికారి ఏ.ఎల్. కృష్ణ రెడ్డి,కవి రాజేంద్ర ప్రసాద్,గంటా మనోహర రెడ్డి,రాధా కుసుమ మున్నగు ప్రముఖుల చేతుల మీదుగా జరగడం విశేషం.ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు,పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు.కవి గద్వాల సోమన్నను తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు అభిందించారు.