రాష్ట్రమంతా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు

నవగీతం, హైదరాబాద్: భానుడి భగభగలతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఎండ తీవ్రతతో వడదెబ్బ బారిన పడి ఇద్దరు వృద్ధులతోపాటు నలుగురు వ్యక్తులు మరణించారు. మరో రెండు రోజులపాటు పగటి ఉష్ణోగ్రతల్లో ఎటువంటి మార్పు ఉండబోదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కుమరం భీమ్‌ - అసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలంలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, జిల్లా కేంద్రమైన అసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లా బుట్టాపూర్‌, నిజామాబాద్‌ జిల్లా మెండోరాలో 44.5 డిగ్రీలుగా నమోదైంది. ఈ ఏడాది...