నవగీతం,కోరుట్ల ప్రతినిధి :
కోరుట్ల పట్టణంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఐదు పెండింగ్ డీఏలు మంజూరు చేయాలని, 51 శాతం ఫిట్‌మెంట్‌తో కొత్త పీఆర్సీ ప్రకటించాలని, రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ నిధులను వెంటనే చెల్లించాలని మరియు సమగ్ర హెల్త్ పాలసీని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తమ విన్నపాలతో కూడిన మెమోరాండంను కోరుట్ల ఆర్డీఓ మరియు ఎంఆర్ఓ లకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు.