navageetam.com
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 4:09 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

రైతుల సమస్యల పరిష్కారానికి రైతు కమిటీ ఏర్పాటు

రెండవ వరి కొనుగోలు కేంద్రం కొరకు అందరూ సహకరించాలి : సర్పంచ్ బండి రాజేష్

నవగీతం,ఇబ్రహీంపట్నం :

ఇబ్రహీంపట్నం మండలం గోదుర్ గ్రామంలో ఆదివారం రైతు సమస్యల పరిష్కారానికి రైతు వేదిక లో రైతు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ బండి రాజేష్ మాట్లాడుతూ.. గ్రామంలో రైతు కమిటీ ఏర్పాటు చేసి రైతుల సమస్యల పరిష్కారానికి రైతు అభివృద్ధికి మరియు అన్ని విధాల రైతు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు గురించి కమిటీ ఉండాలని ఇందులో ప్రతి రైతు భాగస్వామ్యం కావాలని అన్నారు. రెండవ వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు తగిన భూమిని సేకరించుటకు అన్ని సంఘాల రైతులు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దల సహకారంతో ఏర్పాటు చేసుకుందామని అన్నారు రైతు కమిటీ ద్వారా తగిన నిధిని ఏర్పాటు చేసుకొని కొనుగోలు కేంద్రానికి సరిపోయే సొంత స్థలం సేకరించే వరకు ప్రస్తుతానికి తగిన భూమిని లీజుకు తీసుకొని వరి కొనుగోలు కేంద్రం ఏర్పరచుకుందామని అన్నారు. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామ రైతులు వివిధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు అలాగే గోదూర్ గ్రామం ప్లాస్టిక్ రహిత గ్రామంగా చేయుటకు మే 1 నుండి ప్లాస్టిక్ గ్లాసులు ప్లేట్లు కవర్లు వస్తువులు వాడకూడదని వీటిని నిషేధించడం జరిగిందని అందరు సహకరించాలని కోరారు. అనంతరం గ్రామ ప్రజలు గ్రామంలో ప్లాస్టిక్ ను నిషేధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి రాజేష్ ఉపసర్పంచ్ ఓంకారి లక్ష్మణ్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పడాల రాజన్న సాత్పడి పురుషోత్తం ధ్యావ రాజ గంగారం వార్డు సభ్యులు గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు.