navageetam.com
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 6:46 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం…

రైతులు పండించిన చివరి గింజవరకు కొనుగోలు చేస్తాం..

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

నవగీతం,కోరుట్ల ప్రతినిధి:

రైతులు పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని,రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కల్వకోట గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఈదుల లింగంపేటలో ఆభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేడ్-ఏ వరికి రూ.2389 మద్దతు ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నామని, సన్న వడ్ల రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ.57 వేల కోట్ల రుణాలు మంజూరు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండల అధ్యక్షులు ఏనుగు రమేష్ రెడ్డి , భీమారం మండల అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాద వినోద్ కుమార్, ఎమ్మార్వో మునిందర్, వల్లంపల్లి గ్రామ సర్పంచ్ సట్ట భూమేష్,మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు గుగ్గిల రమేష్, వెలమ నవీన్ రెడ్డి, సాయిని గంగారెడ్డి నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.