రోడ్డు భద్రతపై‘అరైవ్ అలైవ్’అవగాహన

శ్రమదానంతో గుంతల పూడ్చివేత నవగీతం, కథలాపూర్ ప్రతినిధి: రహదారి నిబంధనలపై అవగాహన కలిగి ఉండటం వల్ల ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం కథలాపూర్ మండలం తాండ్రియాల్ గ్రామంలో ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సమీపంలోని బీటీ రోడ్లు, స్థానిక రహదారులపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను (బ్లాక్ స్పాట్లను) అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి గుర్తించారు. అనంతరం గ్రామస్తుల సహకారంతో...