రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు: “అరైవ్ అలైవ్” నినాదంతో చైతన్యం
నవగీతం,ఇబ్రహీంపట్నం ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఎస్సై నవీన్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు." అరైవ్ అలైవ్ " అనే నినాదంతో నిర్వహించిన సమావేశంలో ఎస్సై నవీన్ కుమార్ మాట్లాడుతూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మైనర్ డ్రైవింగ్, అతివేగం, హెల్మెట్ ధరించకపోవడం వల్ల విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను నిబంధనలను ప్రాణ రక్షణ...