రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
నిబంధనలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణం: మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత మైనర్లకు వాహనాలు ఇవ్వద్దు: కమిషనర్ రవీందర్ నవగీతం,కోరుట్ల ప్రతినిధి: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై కనీస అవగాహన కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారానే ప్రాణాలను కాపాడుకోవచ్చని మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా కోరుట్ల పట్టణంలో సోమవారం రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రవీందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో...