వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి…తహసిల్దార్ వరప్రసాద్
నవగీతం,ఇబ్రహీంపట్నం ప్రతినిధి: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఇబ్రహీంపట్నం తాహసిల్దార్ వరప్రసాద్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాహసిల్దార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ వరప్రసాద్ మాట్లాడుతు రైతులు కొనుగోలు కేంద్రం లో ధాన్యాన్ని అమ్మి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ పి ఓ చైర్మన్ కుంభాల రాజిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎలాల వెంకటరెడ్డి,...