navageetam.com
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 1:59 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

వల్లంపల్లి లో సీసీ కెమెరాలు ప్రారంభించిన కోరుట్ల సిఐ

సిసి కెమెరాలు అమార్చడానికి ఎన్నారై లు ముందుకు రావడం అభినందనీయం

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:

మేడిపల్లి మండలంలోని వల్లంపల్లి గ్రామంలో సోమవారం కోరుట్ల సీఐ కే లక్ష్మీనారాయణ సిసి కెమెరాలు ప్రారంభించారు. బెహరన్ లో నివాసముంటున్న గ్రామానికి చెందిన కొందరు యువకులు సంఘంగా ఏర్పడి గ్రామంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో సీసీ కెమెరాల అవసరాన్ని వారు గుర్తించి సుమారు రూ.1 లక్షా 50 వేల, విలువగల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వల్లంపల్లి గ్రామ సర్పంచ్ సట్ట భూమేష్ నేతృత్వంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవం సిఐ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. విదేశాలలో ఉన్న గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇలాంటి ప్రజా ఉపయోగకరమైన పనులు నిర్వర్తించడం సంతోషకరమైన విషయమని అన్నారు.

తన సర్కిల్ పరిధిలోని మిగతా గ్రామాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇలాంటి ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాను అని తెలిపారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన బహరేన్ నివాస గ్రామస్తులు, గ్రామ ప్రజలను మనస్పూర్తిగా అభినందిస్తున్నాననని తెలిపారు. అనంతరం మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సహకారం ఉంటే పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో మరింత గొప్పగా సేవలు చేసే అవకాశం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో పాటుగా గ్రామ ప్రజలు పాల్గొన్నారు.