16వ వార్డులో బ్లీచింగ్ పౌడర్ పిచికారి
నవగీతం , కోరుట్ల ప్రతినిధి :
పట్టణంలోని 16వ వార్డు కౌన్సిలర్ పొట్ట సురేందర్ ప్రత్యేక చొరవతో వార్డు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దోమల నివారణకు మరియు వార్డు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టి మున్సిపల్ సిబ్బందితో కలిసి వార్డులోని మురికి కాలువల్లో బ్లీచింగ్ పౌడర్‌ను చల్లించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, దోమల వృద్ధిని అరికట్టడం ద్వారానే కాలానుగుణంగా వచ్చే వ్యాధులను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా వార్డులో పారిశుధ్య పనులను నిరంతరం పర్యవేక్షిస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.