విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలి

నవగీతం,కోరుట్ల ప్రతినిధి : కోరుట్ల పట్టణం స్థానిక 4వ వార్డు అంబేద్కర్ నగర్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఏంపిపిఎస్ లో వీడ్కోలు వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి.పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం ప్రత్యేక ఆహ్వానం మేరకు 4వ వార్డు కౌన్సిలర్ తెడ్డు శ్రీజ విజయ్ కుమార్ ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ..విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదవాలని, క్రమశిక్షణతో కూడిన విద్యే ఉన్నత భవిష్యత్తును ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు,...