navageetam.com
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 3:38 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటం తగదు.

స్థలం కేటాయింపు పై జిల్లా మంత్రి జోక్యం చేసుకోవాలి.

మే 15లోపూ కేంద్రియ విద్యాలయంకు స్థలం కేటాయింపు చెయ్యాలి.

లేని పక్షంలో మే 15 జిల్లా కేంద్రంలో ఎంపీ  అరవింద్ ధర్మపురి నిరాహార దీక్ష చేస్తారు

బిజెపి రాష్ట్ర నాయకురాలు డాక్టర్ బోగ శ్రావణి ప్రవీణ్.

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

విద్యార్థుల భవిష్యత్ తో నాయకులు చెలగాటం ఆడడం సరికాదని, తక్షణమే కేంద్రియ విద్యాలయం కు స్థలం కేటాయించాలని బిజెపి రాష్ట్ర నాయకురాలు డాక్టర్ బోగ శ్రావణి డిమాండ్ చేశారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానీక ప్రెస్ క్లబ్ లో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రావణి మాట్లాడుతూ జగిత్యాల జిల్లాకు కేంద్ర ప్రభుత్వం నవోదయ, కేంద్రియ విద్యాలయాలను మంజూరు చేసిందన్నారు. కోరుట్ల లో ఏర్పాటూ చేసిన నవోదయ విద్యాలయం ఏర్పడి, ఏడాది కాలం పూర్తయ్యిందని గుర్తు చేశారు. కానీ జగిత్యాల రూరల్ మండలం చల్ గల్ గ్రామంలో వాలంతరి లో స్థలం 10 ఎకరాలు కేటాయించడం ఎందుకు ఇబ్బంది అవుతుందో స్థానిక ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఏ పార్టీలో ఉన్నాడో తెలియని నాయకులు, అభివృద్ధి కోసం పార్టీ మారిన నాయకులు, అభివృద్ధికి చిహ్నంగా నిలిచే కేంద్రియ విద్యాలయంకు స్థలం కేటాయించడంలో ఎందుకు తాత్సరం చేస్తున్నారని శ్రావణి ప్రశ్నించారు. నిజామాబాద్ లోని కలికోట లో ఎప్పుడో స్థలం కేటాయింపు జరిగిందని, వనపర్తి లో స్థలం కేటాయింపు జరిగిన జగిత్యాలలో ఎందుకు స్థల కేటాయింపునకు నిర్లక్ష్యం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. సీఎం, మంత్రులను కలిసి అభివృద్ధికి పాటుపడే ఎమ్మెల్యే , ఫోటోలు, ప్రెస్ మీట్ లు పెట్టి ప్రచారం చేసుకోవడం మానుకోవాలని, పనిచేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని శ్రావణి హితవు పలికారు. విద్యార్థుల భవిష్యత్ తో స్థానిక ఎమ్మెల్యే ఆడుకుంటున్నారని, స్వార్థం, స్వలాభం కోసం ఎమ్మెల్యే ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. జగిత్యాల నియోజకవర్గం లో కేంద్రియ విద్యాలయం స్థలం కేటాయింపు విషయంలో జిల్లా మంత్రి జోక్యం చేసుకోకపోవడం విచారకరం అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడికి మంత్రి తలోగ్గారా? లేదా మంత్రి జగిత్యాల విషయంలో జోక్యం చేసుకోవడం లేదా అనే విషయం పై స్పష్టత ఇవ్వాలన్నారు. కేంద్రియ విద్యాలయం స్థలం కేటాయింపు విషయంలో నిర్లక్ష్యం పై జిల్లా మంత్రి తక్షణమే స్పందించాలన్నారు. జిల్లా అభివృద్ధి గురించి గాని, జిల్లా ప్రజల గురించి గానీ, జిల్లా విద్యార్థుల భవిష్యత్ పై మంత్రికి కనీసం బాధ్యత లేదా అని శ్రావణి ప్రశ్నించారు. కేంద్రియ విద్యాలయం స్థలం కేటాయింపు విషయం పై నాయకుల చిత్తశుద్ధి లోపమా? లేదా లోపాయికారి ఒప్పందమా అనేది అనుమానం కలుగుతుందన్నారు. కేంద్రియ విద్యాలయానికి స్థలం కేటాయింపు చేయాలనీ, ఏ పార్టీలో ఉన్నాడో తెలియని ఎమ్మెల్యేని, జిల్లా మంత్రిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నామని, మే 15 లోపు స్థలం కేటాయింపు జరగకపోతే, మే 15 న జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్డివో కార్యాలయం ఎదుట కేంద్రియ విద్యాలయం కు స్థలం కేటాయించాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారు నిరాహార దీక్ష చేపడతారు. విద్యార్థుల భవిష్యత్ కు భారతీయ జనతా పార్టీ ఎంత దూరం అయినా వెళ్తామని హెచ్చరించారు. కేంద్రియ విద్యాలయం రావడం కేవలం విద్యార్థుల భవిష్యత్ కోసం మాత్రమే కాదని, ఈ విద్యాలయం ఏర్పాటుతో ఈ ప్రాంత అభివృద్ధి ఆధారపడి ఉందన్నారు. కాబట్టే కేంద్రియ విద్యాలయం ప్రాధాన్యత, విద్యార్తుల భవిష్యత్, ప్రాంత అభివృద్ధికై తప్పనిసరిగా నిరాహార దీక్ష చేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు,జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్,42వ వార్డ్ కౌన్సిలర్ మిమ్మల నాగరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు,జిల్లా ఉపాధ్యక్షులు మ్యాదరి అశోక్,జిల్లా కార్యదర్శి పాత రమేష్,పూదరి శ్రీనివాస్, సిరిపురం శ్రీనివాస్, గట్టిపల్లి జ్ఞానేశ్వర్,పవన్ సింగ్,రవితేజ, గంగరాజం మరియు తదితరులు పాల్గొన్నారు.