navageetam.com
Newspaper Banner
Date of Publish : 25 April 2026, 10:06 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

విధి నిర్వహణలో ఉన్న మున్సిపల్ కార్మికురాలు మృతి

ఆర్థిక సహాయం అందజేత

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి :

మెట్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో కార్మికురాలిగా విధులు నిర్వహిస్తున్న మోర్తాడ్ భాగ్యలక్ష్మి శుక్రవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. విధి నిర్వహణలో ఉంటూ ప్రాణాలు కోల్పోయిన ఆమె కుటుంబాన్ని మున్సిపల్ పాలకవర్గం మరియు తోటి కార్మికులు అక్కున చేర్చుకున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మైలారం లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, 11వ వార్డు కౌన్సిలర్ రెబ్బాస్ మహేష్, 4వ వార్డు కౌన్సిలర్ పందిరి రమేష్ కలిసి వ్యక్తిగతంగా రూ. 13,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. అలాగే మున్సిపల్ కార్యాలయం తరపున రూ. 10,000, కార్మిక సంఘం తరపున మరో రూ. 10,000 కలిపి మొత్తం రూ. 33,000 నగదును బాధిత కుటుంబానికి అందజేసి తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.మృతురాలి సేవలను కొనియాడుతూ జరిగిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, కార్మిక సంఘ కార్యవర్గం మరియు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొని భాగ్యలక్ష్మి భౌతికకాయానికి పూల మాలలతో శ్రద్ధాంజలి ఘటించారు.