నవగీతం,కోరుట్ల:
మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన పెండెల సుగుణ కుమారుడు నరేష్ – విష్ణుప్రియ వివాహం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా జరిగింది.వివాహానికి ఆర్థిక సహాయం అవసరం ఉందని నరేష్ మిత్రుల ద్వారా తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర గల్ఫ్ అడ్వైజరీ కమిటీ మెంబర్, భీమారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి రూ. 5000/-, అలాగే మేడిపల్లి కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చేపూరి నాగరాజు రూ. 5000/- ఆర్థిక సహాయం అందించారు.అదేవిధంగా ఏఎంసీ డైరెక్టర్ బలగం రాజేష్ 25 కేజీల బియ్యం, రాజేందర్ మరో 25 కేజీల బియ్యం అందించి వివాహ ఖర్చులకు తోడ్పాటు అందించారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ… ఇలాంటి సహాయం సమాజంలో ఐక్యతను, మానవత్వాన్ని పెంపొందిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోతు అశోక్, ఉర్మడ్ల హన్మాండ్లు, అంకం శ్రీనివాస్, భూమల్ల మల్లేష్, బద్ది అంజయ్య, మ్యాకల రాజు, మేదరి శ్యాం, మెట్టు ప్రకాష్,సామల్ ఆశన్న, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.