navageetam.com
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 10:53 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

వెల్లుల్లలో బడిబాట కార్యక్రమం

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:

మెట్ పల్లి మండల కేంద్రంలోనీ వెల్లుల గ్రామంలో విద్యా ప్రాముఖ్యతను తెలియజేస్తూ బడిబాట కార్యక్రమాన్ని స్థానిక అధికారులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని చిన్నారులను పాఠశాలలో చేర్పించేందుకు అవగాహన ర్యాలీ చేపట్టారు.గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొని “ప్రతి బాలుడు పాఠశాలకు – మంచి భవిష్యత్తుకు మార్గం” అనే నినాదాలు చేశారు. తల్లిదండ్రులకు విద్య అవసరాన్ని వివరించి, పిల్లలను పాఠశాలకు పంపించాలని కోరారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి బాలుడు విద్యను పొందేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.
గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ, పిల్లల భవిష్యత్తు కోసం విద్య అత్యంత ముఖ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నాంపల్లి మారుతి,గ్రామ సర్పంచ్ గూడూరు తిరుపతి,కార్యదర్శి నారాయణ, ఉపాధ్యాయులు స్వప్న,వేణు, రాజేష్, పిఆర్పీ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.