navageetam.com
Newspaper Banner
Date of Publish : 12 April 2026, 9:56 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

వైభవంగా మల్లికార్జున స్వామి కళ్యాణం

బోనాలతో మొక్కులు తీర్చుకున్న భక్తులు

నవగీతం మల్లాపూర్ ప్రతినిధి

మల్లాపూర్ మండలంలోని రాఘవపేట గ్రామంలో శ్రీ మల్లికార్జున జాతర మహోత్సవంలో భాగంగా నేడు ఉదయం శ్రీ మెడలమ్మ కేతమ్మ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణం ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం సాయంత్రం గ్రామంలో సుమారు 100 బోనాలు స్వామి వారికి ప్రధాన విధుల గుండా శివ శక్తుల పూనకలతో,ఒగ్గు పూజరుల విన్యాసాలతో భక్తుల పాదయాత్రతో సుమారు వెయ్యి మందితో ఘనంగా బోనాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో శ్రీ మల్లన్న ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భైరి రాకెష్ యాదవ్,ఉపాధ్యక్షుడు తాలూకా మల్లయ్య, కార్యదర్శి భైరి రవికుమార్ యాదవ్,మ్యాకల మల్లయ్య యాదవ సంఘ సభ్యులు, మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.