ప్రభుత్వం నుండి రెండు లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
నవగీతం,చొప్పదండి ప్రతినిధి:
సీనియర్ పాత్రికేయులు సంబోజి శేఖర్ మృతి చెందడం చాలా బాధాకరం, వారి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ప్రభుత్వం నుండి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం శేఖర్ సంతాప సభలో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శేఖర్ కుటుంబాన్ని దగ్గరికి తీసుకొని కాంగ్రెస్ పార్టీ మీ వెన్నంటే ఉంటుందంటూ భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రజాప్రతినిధులు, నాయకులంతా కలిసి వారిని ఆదుకోవడానికి ఆర్థికంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా చేయూతనందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.శేఖర్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండగట్టు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్, వాయిస్ చైర్ పర్సన్ పెరుమండ్ల మానస గంగయ్య కౌన్సిలర్లు కొట్టే అశోక్, కనుమల్ల రాజశేఖర్, వడ్లూరి అనూష శ్యాంసుందర్, ఓలు గోత్తుల సురేష్, గుర్రం రాజేందర్ రెడ్డి, గుర్రం సుజిత్ రెడ్డి, పిట్టల వెంకటేష్, ముద్దం రాజేశ్వరి,తిరుపతి, నాయకులు పాల్గొన్నారు.