navageetam.com
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 9:34 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

సంఘ అభివృద్ధికి కృషి చేస్తాం..అధ్యక్షుడు తోట ప్రసాద్, కార్యదర్శి ఆగ సురేష్

మున్నూరు కాపు సంఘం కార్యవర్గం ఎన్నిక

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:

మున్నూరు కాపు దుబ్బవాడ సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన సంఘం అధ్యక్షుడు తోట ప్రసాద్, కార్యదర్శి ఆగ సురేష్ లు తెలిపారు. ఆదివారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో సంఘము ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా తోట ప్రసాద్, కార్యదర్శి గా ఆగ సురేష్, ఉపాధ్యక్షుడిగా నాగుల జైపాల్, క్యాషియర్ గా ఉసికేల లక్ష్మణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా తోట శివ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దొనికేల నవీన్, దోమకొండ రమేష్, జంగిటి గంగాధర్, అరిగేలా భూమయ్య, శివన్నోళ్ల రాజు, గోల్కొండ నాగరాజు, శ్రీనివాస్, రామ్ రెడ్డి, నునుగొండ చంద్ర మోహన్, గుర్రాల కిషన్, గందే వేణు గోపాల్, విజయ్, దొమ్మటి శంకర్, సిర్ప నవీన్, షేర్ వేణు, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.