navageetam.com
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 4:53 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

సమతుల్య ఆహారంతో భవిష్యత్తులో సర్వరోగ నివారణ.

మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:

మహిళలు గర్భిణీలు కిశోర బాలికలు చిన్నారులకు పోషకాలు ఉన్న సమతుల్య ఆహారం అందిస్తేనే భవిష్యత్తులో రోగాలు దరి చేరవని ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్ 14వ వార్డు కౌన్సిలర్ రేంజర్ల కళ్యాణి తో కలసి అవగాహన కల్పించారు పోషణ పక్వడ కార్యక్రమంలో భాగంగా శనివారం కోరుట్ల పట్టణ 14వ వార్డు భీమునిదుబ్బ అంగన్వాడి కేంద్రంలో పాలిచ్చే తల్లులకు శిశువుల పోషణ పై సంపూర్ణ ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళలకు పరిపూర్ణ అవగాహన కల్పించారు పోషకాహారం  వల్ల కలిగే ఆరోగ్యం గురించి క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్య పరుస్తున్నమన్నారు అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల ఎంతో బరువు చూసి ప్రత్యేక రిజిస్టర్ లో నమోదు చేసుకుని సప్లిమెంటరీ పోషకాహార నిపుణులు అవగాహన కిషోరా బాలికలకు రక్తహీనత పరీక్షలు జరుపి పోషకాహర ఆహారం అనుభవించడానికి పిల్లలు గర్భిణీలు బాలింతలు కౌమార దశలోని బాలికలు తీసుకోవాల్సిన అంశాలను వివరించారు అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్ స్థానిక వార్డు కౌన్సిలర్ రేంజర్ల కళ్యాణి ల చేతుల మీదుగా భక్తుల భవిష్ కు అన్నప్రాసన చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్ స్థానిక వార్డు కౌన్సిలర్ రెంజర్ల కళ్యాణి సిడిపిఓ కే మణెమ్మ సూపర్వైజర్ ఏ భారతి అంగన్వాడి టీచర్ ఆర్ రాజమణి ఆర్ పి బి లక్ష్మి ఆశా జ్యోతి ఆయమ్మ పి కవిత మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.