సమన్వయంతో పనిచేసిన పోలీసు అధికారులకు అభినందనలు:జిల్లా జడ్జి రత్న పద్మావతి
మెగా లోక్ అదాలత్ విజయానికి కృషి చేసిన పోలీసు అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేత నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లాలో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌ను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన పోలీస్ అధికారులు, సిబ్బంది బార్ అసోసియేషన్ సభ్యులను జిల్లా జడ్జి రత్న పద్మావతి అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. మార్చి28 న శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో జిల్లా పరిధిలో మొత్తం 3034 కేసులు పరిష్కారం కావడం జరిగింది. ఈ విజయానికి కృషి చేసిన...