నవగీతం, మల్లాపూర్:
గ్రామ సభ ద్వారా సమస్యలను వెలికితీసి వాటికి పరిష్కారం చూపించే చక్కని వేదిక ఈ గ్రామ సభ అని సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ అన్నారు. మల్లాపూర్ మండలం మేజర్ గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రత్యేక గ్రామ సభ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, కార్యదర్శి గూరుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ..ప్రతి వార్డు సభ్యులు మీ యొక్క వార్డులో ఉన్నటువంటి సమస్యలను తెలిపి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా సహకరించాలని , అలాగే యువకులు, మహిళలు మీ వార్డులో ఏవైనా సమస్యలు ఉంటే వార్డ్ మెంబర్ కు తెలిపి మా దృష్టికి తీసుకురావాలని కోరారు.

గ్రామస్థుల సహకారంతో మండల కేంద్రంను మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు.ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి అభివృద్ధి కోసం పలు సూచనలను, సమస్యలు గ్రామ సభ ద్వారా సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. వార్డు సభ్యుల సహకారంతో సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్దామని అన్నారు.అలాగే ఒక మహిళ విద్యుత్ ఏ. ఈ వినీత్ రెడ్డి కాళ్ల పై పడి తన వ్యవసాయ భూమి లో నుండి విద్యుత్ స్థంబాలు తొలగించాలని వేడుకున్నారు. దానికి ఏ ఈ స్పందిస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గడ్డం సోమ రెడ్డి, విద్యుత్ ఏ. ఈ వినీత్ రెడ్డి, వార్డు సభ్యులు కొంపెల్లి రాకేష్, భుక్యా శేఖర్, ముష్కరి రమేష్, ఎనుగంటి నరేష్, ముత్యాల గంగరాజం,ఎం.డీ షబ్బీర్,అరికుప్పల చిన్న రాజం, అల్లె లత,శనిగారపు లావణ్య కాషావత్తుల లక్ష్మి,,కదుర్క లక్ష్మి, ఏనుగు లక్ష్మి-వెంకట్ రెడ్డి,మొరపు గంగా రాజం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూండ్ర శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు గోపిడి శ్రీనివాస్ రెడ్డి,సంగ గంగరాజం, మసీట్ల గంగ నర్సయ్య, బండారి రమేష్, నల్ల రాజేశ్వర్ , క్యాతం సురేష్ రెడ్డి , ఎదులపురం శంకర్, సిరిపురం రవీందర్,నూతిపెల్లి రాజం, మరిపెల్లి మల్లయ్య, కోటగిరి ఆనంద్ గౌడ్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, ఎర్ర భూమయ్య అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
