navageetam.com
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 11:28 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

సింగరేణి పెండింగ్ బకాయిలపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి

సిఐటియు ఆధ్వర్యంలో చలో విద్యుత్ సౌదా

నవగీతం, మందమర్రి:

సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఈనెల 28న సంస్థకు రావలసిన పెండింగ్ బకాయిల కొరకు చలో విద్యుత్ సౌదా కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను సిఐటియు డిప్యూటీ జనరల్ సెక్రెటరీ అల్లి.రాజేందర్ బ్రాంచ్ అధ్యక్షులు ఎస్ వెంకట స్వాముల ఆధ్వర్యంలో కాసిపేట 2 పిట్ కమిటీతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ ద్వారా బొగ్గు కొనుగోలు, విద్యుత్తు కొనుగోలు ద్వారా తెలంగాణ విద్యుత్ సంస్థల నుండి పెద్ద మొత్తంలో రావాల్సిన రూ .46 వేల కోట్ల చెల్లించకపోవడం మూలంగా సింగరేణి సంస్థ ఆర్థికంగా నష్టపోతున్నదనన్నారు ఈ డబ్బుల చెల్లింపు కోసం ఇప్పటివరకు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఎవరూ పట్టించుకోవడంలేదని అందుకే విద్యుత్ సంస్థల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేయడానికి నిర్ణయించడం జరిగిందని కార్మికులందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.ఇప్పటికే జీతాల కోసం అధికారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని, కనీసం అండర్ గ్రౌండ్ లో పనిచేయడానికి సరిపడా ఇవ్వాల్సిన బిట్లు, డ్రిల్ రాడ్లు, నాణ్యత గల గ్లౌజులు ఇవ్వడం లేదని మరోవైపు కార్మికులకు వైద్య పరంగా అందించాల్సిన నాణ్యమైన మందులు కాకుండా ఎల్ వన్ మందులను కొనుగోలు చేస్తున్నారని, కొత్త గనులు రాకపోవడం మూలంగా కోల్ బెల్ట్  ప్రాంతాల్లో నిరుద్యోగ యువత ఖాళీగా తిరుగుతున్నారని కారుణ్య నియామకాల కొరకు పిలవాల్సిన మెడికల్ బోర్డును సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత కూడా ఏర్పరచపోవడం మూలంగా చాలామంది కార్మికులు డ్యూటీలు చేయలేక అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతున్నారని వెంటనే మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వాలు తమ అవసరాల కోసం సంస్థ నుండి తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసి ఉచిత కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ సంస్థకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా మెడికల్ ఫిట్ అయిన డిపెండెంట్ లకు కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపి వారి సర్వీస్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారన్నారు కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్ లను అడ్డుపెట్టుకొని 12వ వేతన ఒప్పందం కమిటీ ఏర్పాటు చేయడంలేదని కార్మికులకు, కార్మిక సంఘాలకు ఇబ్బందిగా ఉన్న లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా త్వరలో ఎనర్జీ సెక్టార్ తో నిరవధిక సమ్మె చేయించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పిట్ సెక్రటరీ బుద్దే సురేష్, అసిస్టెంట్ బిట్ సెక్రటరీ నామాని.సురేష్, ధనిశెట్టి. సురేష్, షిఫ్ట్ ఇంచార్జ్, గని కార్మికులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.