నవగీతం, కోరుట్ల ప్రతినిధి:
మేడిపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏనుగు రమేష్ రెడ్డి, మండల మార్కెట్ కమిటీ చైర్మన్ మాదం వినోద్ యాదవ్ ఆధ్వర్యంలో మండల కేంద్రానికి చెందిన లబ్ధిదారులు క్యాతం లక్ష్మీ రూ.60,000 బొంగోని లక్ష్మీ లకు రూ.27,500 విలువ గల సీఎం ఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చేపూరి నాగరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బలగం రాజేష్ , సీనియర్ నాయకులు ఉరుమడ్ల నరసయ్య, మాజీ ఎంపిటిసి దాసరి శంకర్, కుంట నారాయణ, యూత్ సభ్యులు మార్గం నవీన్, మధు ,చందు రాజేందర్ ,దేవగౌడ్ తదితరులు పాల్గొన్నారు..