సీఎం ఇచ్చిన టీచర్ ఉద్యోగం.. 8 నెలల్లో రద్దు ..న్యాయం కోసం హమాలీగా మారిన లక్ష్మీరాజం పోరాటం
కాళ్ల మీద పడ్డ కనికరించని మంత్రులు,ఎమ్మెల్యేలు నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామానికి చెందిన ముదిగంపల్లి లక్ష్మీరాజం న్యాయం కోసం ఏడాది కాలంగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. ఒకప్పుడు ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన, ఇప్పుడు బతుకుదెరువు కోసం హమాలీ, సెంట్రింగ్ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ, తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయంలో స్పెషల్ బీఎడ్ పూర్తి చేసిన లక్ష్మీరాజం 2008లో సర్వశిక్షా అభియాన్‌లో చేరి, అనంతరం ఇనక్లూజివ్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పనిచేశాడు. 2012లో వీఆర్‌ఏ.గా ఎంపికై...