సురభి నవీన్ కుమార్ ‘విజయ సంకల్ప’ ర్యాలీ
అడుగడుగునా ఘనస్వాగతం నవగీతం,కోరుట్ల ప్రతినిధి: బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రెండోసారి నియమితులైన సురభి నవీన్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి కోరుట్ల నియోజకవర్గానికి విచ్చేయగా, బిజెపి శ్రేణులు స్వాగతం పలికాయి. మెట్‌పల్లి నుంచి కోరుట్ల వరకు వందలాది మంది కార్యకర్తలతో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ నియోజకవర్గంలో నూతన ఉత్సాహాన్ని నింపింది. మెట్‌పల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నవీన్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నుండే భారీ బైక్ ర్యాలీ ప్రారంభమైంది. ‘జై శ్రీరామ్’, ‘భారత్...