navageetam.com
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 11:25 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

సేవా కార్యక్రమాలకు యువకులు ముందుకు రావాలి.. సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్

స్నేహితుడి జ్ఞాపకార్థంగా చలివేంద్రాలు ఏర్పాటు

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:

మాల్లాపూర్ యువకులు సేవా కార్యక్రమాలు చేయడానికి గ్రామాన్ని అభివృద్ధి పరచడానికి ముందుకు రావాలని సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ కోరారు..మల్లాపూర్ మండల కేంద్రంలో హెల్పింగ్ స్క్వాడ్ , గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో  చలివేంద్రాలు ఏర్పాటు చేసారు.ఈ చలివేంద్రాలను సర్పంచ్ పాలకవర్గ సభ్యులు ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ… హెల్పింగ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో స్నేహితుడి జ్ఞాపకార్థం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం చాలా మంచి ఆలోచన అని యువకులు ఇలాగే ముందు ముందు సేవా కార్యక్రమాలు చేస్తూ మల్లాపూర్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని కోరారు. యువకులకు ఎలాంటి అవసరాలు ఉన్న నేను మా పాలకవర్గం ఎప్పుడు అండగా ఉంటామని సర్పంచ్ లక్ష్మణ్ అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ ఏ ఈ సిరిపురం సంతోష్,ఉపసర్పంచ్ సోమ రెడ్డి, వార్డు సభ్యులు ముష్కరి రమేష్,మహమ్మద్ షబ్బీర్,ఏనుగంటి నరేష్,ముత్యాల గంగా రాజం,భుక్యా శేఖర్,మొరపు గంగారాజం, అల్లె లత, కదుర్క లక్ష్మి, ముష్కరి రాకేష్  సామాజిక కార్యకర్త ఏవిఆర్ ,సిరిపురం రవీందర్ పెంబి విద్యాధర్, రెవెల్లి నవీన్, పల్లె మధు, వసంత్, మెట్టు బాబు, ముద్దం శ్రవణ్,ముచుకుర్తి హరిష్, రఘు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.