navageetam.com
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 12:11 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

స్నేహబంధానికి ఆపన్నహస్తం ..ఆదర్శంగా నిలిచిన పూడూరు 2001-02 బ్యాచ్ విద్యార్థులు

నవగీతం, కొడిమ్యాల:

కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల రోజుల్లో పంచుకున్న జ్ఞాపకాలు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా,కష్టకాలంలో తోటి మిత్రులకు అండగా నిలిచే శక్తిగా మారవచ్చని పూడూరు ప్రభుత్వ పాఠశాల 2001-02 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు నిరూపించారు.గెట్-టుగెదర్’ కార్యక్రమంలో పాత మిత్రులంతా ఒకచోట చేరి చిన్ననాటి స్మృతులను నెమరవేసుకున్నారు. ఆనందోత్సాహాల మధ్య సాగిన ఈ కార్యక్రమం కేవలం విందు, వినోదాలకే పరిమితం కాకుండా తమ బ్యాచ్‌లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు చేయూతనివ్వాలని నిర్ణయించిన విద్యార్థులు, స్వచ్ఛందంగా నిధులు సేకరించారు. ఈ నిధుల నుంచి ఒకరికి రూ. 50,000, మరొకరికి రూ. 20,000 ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గికురి అంజయ్య కి రూ. 25,000 అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.ఇదే స్ఫూర్తితో వీరబత్తిని గంగాసాగర్ తన మిత్రుల సహకారంతో అదనంగా మరో రూ. 25,000 సహాయం అందించారు. స్నేహం అంటే కేవలం కలిసి తిరగడం మాత్రమే కాకుండా, కష్టసమయంలో చేయూతనివ్వడం కూడా అని చాటిచెప్పిన ఈ యువతను గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు