స్మశాన వాటికకు మహర్దశ – పిచ్చిమొక్కల తొలగింపు.. కొత్త మోటార్ ఏర్పాటు
వార్డు కౌన్సిలర్ శిరీష శేఖర్ రెడ్డి వెల్లడి నవగీతం కోరుట్ల ప్రతినిధి: కోరుట్ల పట్టణంలోని 6వ వార్డులో ఉన్న స్మశాన వాటిక రూపురేఖలు మారుతున్నాయి. గత కొంతకాలంగా నిరాదరణకు గురై, అపరిశుభ్రతతో నిండిన స్మశాన వాటికను వార్డు కౌన్సిలర్ శిరీష శేఖర్ రెడ్డి పర్యవేక్షణలో శుభ్రం చేయించిప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. బుధవారం స్మశాన వాటికలో పేరుకుపోయిన పిచ్చిమొక్కలను,భారీ బండరాళ్లను యంత్రాల సహాయంతో తొలగించారు. అదేవిధంగా, గతంలో ఇక్కడున్న బోర్ మోటార్ పాడై నీటి సరఫరా నిలిచిపోవడంతో, అంత్యక్రియల సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో...