navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 April 2026, 3:45 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ రఘు

నవగీతం,మెట్ పల్లి/మల్లాపూర్

మెట్ పల్లి పట్టణంలోని కాశీభాగ్ హనుమాన్ ను గురువారం నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు దర్శించుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు.ఆయన వెంట నాయకులు రేండ్ల రాజన్న, వెంకటేశ్ తదితరులు ఉన్నారు.మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో బుధవారం జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో డాక్టర్ రఘు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, లక్పతి, అంజిరెడ్డి, శ్రీధర్ గౌడ్, డాక్టర్ సాయి, నర్సగౌడ్, ప్రశాంత్, గౌతం, శీను, శ్రీధర్, రిషి, మల్లేష్, శీను, నవీన్ రెడ్డి, వినోద్, శశి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.