4వ వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో మాజీ మావోయిస్టు నేత తిప్పిరి తిరుపతికి సన్మానం

నవగీతం, కోరుట్లప్రతినిధి: అణగారిన వర్గాల విముక్తి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం దశాబ్దాల పాటు సాయుధ పోరాట బాటలో నడిచిన మాజీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు తిప్పిరి తిరుపతి (దేవన్న)ని కోరుట్ల పట్టణంలోని 4వ వార్డు కౌన్సిలర్ బృందం శనివారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ బృందం మాట్లాడుతూ, కేవలం వార్తా పత్రికల్లో మాత్రమే చూసే ఒక గొప్ప విప్లవ యోధుడిని ప్రత్యక్షంగా కలుస్తామని కలలో కూడా ఊహించలేదని, అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం...