నవగీతం,కోరుట్ల ప్రతినిధి :
కోరుట్ల పట్టణంలో కట్కం సంగయ్య ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పదవ తరగతి ఫలితాల్లో మండల స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించిన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. క్రమశిక్షణ, నిరంతర కృషితోనే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని, ఉన్నత శిఖరాలను అధిరోహించి కోరుట్ల నియోజకవర్గానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు శాలువాలతో సత్కరించి మెమెంటోలు అందజేసి అభినందించిన ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్లు , స్కూల్ ప్రిన్సిపాల్ రేణుక , అకాడమిక్ డీన్ రాజశేఖర్, సి బ్యాచ్ ఇంచార్జ్ అనిల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ముఖ్య నాయకులు , తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
