navageetam.com
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 3:44 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ ఆదర్శ పాఠశాల పదవ తరగతి టాపర్స్ సెవ్వ రిశ్వంత్ 570, బొక్కల చరణ్య 568,ఊరేడి హరిణి 559,గొట్టిపడుత వైష్ణవి 542 ని శ్రీ సరస్వతి విద్యాలయం కరస్పాండెంట్ సిరిపురం రవీందర్ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా సిరిపురం రవీందర్ మాట్లాడుతూ ఇటీవలే ఆదర్శ పాఠశాల లో టాపర్స్ గా నిలిచిన ఈ విద్యార్ధినీ,విద్యార్థులు నర్సరీ నుండి ఐదవ తరగతి వరకు శ్రీ సరస్వతి విద్యాలయం లోనే విద్యను అభ్యసించారని, వీరంతా ఇంకా పై చదువులు చదివి, ఉన్నత శిఖరాలకు చేరుకొని కుటుంబాలకు, గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ తోట రవీందర్, డైరెక్టర్ వినోద్,సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి, పెరుమాండ్ల రాజేందర్ గౌడ్, బొక్కల నాగరాజు, గొట్టిపడుత రమేష్ గౌడ్, సుంచుల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.