navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 2:41 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అన్నదాత విద్యుత్ ప్రదాత: ఏఈ యశ్వంత్ రావు

సౌరశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి అదనపు ఆదాయాన్ని పొందాలి

నవగీతం, వేల్పూర్ ప్రతినిధి:

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా రైతు వేదిక హాల్లో గురువారం జరిగిన అన్నదాత విద్యుత్ ప్రదాత కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఈ యశ్వంత్ రావు మాట్లాడుతు అన్నదాత విద్యుత్ ప్రదాత” (రైతులే విద్యుత్ ఉత్పత్తిదారులు) అనేది ఆధునిక వ్యవసాయంలో ఒక విప్లవాత్మకమైన భావన. రైతులు ఆహారాన్ని పండించడమే కాకుండా, సౌరశక్తి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, అదనపు ఆదాయాన్ని పొందాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది రైతుల విద్యుత్ క్షేత్రాల్లో సోలార్ పంపులను ఏర్పాటు చేయడం ద్వారా, అన్నదాతలు ఇంధన ప్రదాతలుగా మారుతున్నారు.పీఎం కుసుమ్ ఈ పథకం ద్వారా రైతులు తమ భూమిలో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని, విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, డిస్కాంలకు  విక్రయించవచ్చు ఈ విధానం వల్ల సాగుతో పాటు, విద్యుత్ విక్రయం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. హరిత ఇంధనం ఇది పర్యావరణానికి మేలు చేయడంతో పాటు, రాత్రి వేళల్లో విద్యుత్ అవసరం లేకుండా సౌరశక్తిని వినియోగించుకునేలా చేస్తుందని అన్నారు.ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సారెడ్డి , యశ్వంత్ రావు ఏఈ ఆపరేషన్ వేల్పూర్ మరియు వేల్పూర్ సెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.