navageetam.com
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 8:06 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పది టాపర్లకు ఘన సన్మానం

 

మెమొంటోలతో అభినందన.. విద్యతోనే సమాజాభివృద్ధి: అధ్యక్షుడు బండారి నర్సయ్య

నవగీతం,ఇల్లంతకుంట ప్రతినిధి:

అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 137A ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివి పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను మంగళవారం ఘనంగా సన్మానించారు. మెమొంటోలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు బండారి నర్సయ్య మాట్లాడుతూ విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమన్నారు. రాబోయే రోజుల్లో మీరు కలలుగన్న చదువులు చదివి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎదిగి సమాజ మార్పుకు కృషి చేయాలని సూచించారు. మీ చదువు మరో పది మందికి సాయపడేలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ మొదటి మెట్టులో రాణించిన మీరు అన్ని తరగతుల్లోనూ ఇదే విధంగా టాప్ ర్యాంకులు సాధించాలని కోరారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ప్రతిభ కలిగిన విద్యార్థులను క్లబ్ ప్రోత్సహిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అలయన్స్ జిల్లా చైర్మన్ డా. ఎలగందుల శ్రీనివాస్, జిల్లా పీఆర్వో పుల్లెల శ్యామ్, జిల్లా వైస్ గవర్నర్ విద్యాసాగర్, జోనల్ చైర్మన్ అల్లాడి ఆనంద్ కుమార్, ఇల్లంతకుంట క్లబ్ ప్రధాన కార్యదర్శి కూనబోయిన బాలరాజు, కోశాధికారి బొంగోని సత్యనారాయణ, పీఆర్వో రాజెల్లయ్య, మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య, మీడియా ఇన్‌చార్జి దయ్యాల సురేష్, సలహాదారులు మొగిల్ల బాబు, పర్శ ఐలయ్య, కీసరి కనుకయ్య, కోహెడ భాస్కర్, హెల్త్ క్యాంప్, బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్ ఇన్‌చార్జిలు రేగుల కార్తీక్, అంతటి తిరుపతి, దినేష్, కొమిరె శ్రీనివాస్, మహేష్, గడ్డం రవి, మ్యాకల ఐలయ్య, బండారి మాధవి, అంతటి సుజాత, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.