అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పది టాపర్లకు ఘన సన్మానం

  మెమొంటోలతో అభినందన.. విద్యతోనే సమాజాభివృద్ధి: అధ్యక్షుడు బండారి నర్సయ్య నవగీతం,ఇల్లంతకుంట ప్రతినిధి: అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 137A ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివి పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను మంగళవారం ఘనంగా సన్మానించారు. మెమొంటోలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు బండారి నర్సయ్య మాట్లాడుతూ విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమన్నారు. రాబోయే రోజుల్లో మీరు కలలుగన్న చదువులు చదివి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎదిగి సమాజ మార్పుకు కృషి చేయాలని...