అల్లిపూర్‌లో ఘనంగా శ్రీ పెద్దమ్మతల్లి జాతర బోనాలు

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ బోగ శ్రావణి నవగీతం,రాయికల్ ప్రతినిధి: రాయికల్ మండలంలోని అల్లిపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ పెద్దమ్మతల్లి జాతర బోనాలు మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ బోగ శ్రావణి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజల సుఖశాంతులు, రైతుల అభివృద్ధి, యువతకు మంచి భవిష్యత్తు కలగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. జాతర సందర్భంగా గ్రామంలో భక్తుల సందడి నెలకొంది....