ఆపదలో కార్మికురాలికి అండగా
పారిశుధ్య కార్మికురాలికి ఆర్థిక సాయం నవగీతం,మెట్‌పల్లి ప్రతినిధి : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని 6వ వార్డులో విధి నిర్వహణలో ఉన్న పారిశుధ్య కార్మికురాలు స్వప్నపై గురువారం ఉదయం వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ హఠాత్పరిణామంలో ఆమె ముఖం మరియు కాలిపై తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు మరియు తోటి కార్మికులు తక్షణమే స్పందించి ఆమెకు అండగా నిలిచారు.గాయపడి చికిత్స పొందుతున్న స్వప్నను పరామర్శించి,ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం కార్మిక సంఘం తరపున ఆర్థిక సాయాన్ని...