నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:
ఆర్థిక ఇబ్బందులు,అనారోగ్య సమస్యలను భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన కొడిమ్యాల మండలంలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.కొడిమ్యాల మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన చొప్పరి రాజవ్వ, కొమురయ్యల కుమారుడు చొప్పరి మనోజ్ (22) గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన మనోజ్, గురువారం ఉదయం 9 నుండి 10 గంటల మధ్య ప్రాంతంలో గ్రామ శివారులోకి వెళ్లాడు. అక్కడ ఓ చెట్టుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.గమనించిన స్థానికులు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కొడిమ్యాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సందీప్ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.