ఇంటర్‌లో రాష్ట్ర స్థాయి ప్రతిభ..
రాయికల్ కేజీబీవీ విద్యార్థిని నందినికి రూ.25 వేల పురస్కారం నవగీతం, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లా రాయికల్‌లోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం విద్యార్థిని ఎన్. నందిని ఇంటర్మీడియట్–2026 ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో సి.ఇ.సి గ్రూపులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మరోసారి జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నందినిని ఘనంగా సన్మానించారు. ఇటీవల...