విద్యార్థికి నెల వేతనాన్ని అందించిన సర్పంచ్
నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:
మల్లాపూర్ మండలం కొత్త దాంరాజ్ పల్లి గ్రామ ఉన్నత పాఠశాలలో చదివి పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్పంచ్ ఎగ్యారపు లింబాద్రి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పాఠశాల టాపర్ గా నిలిచిన పోలాస ధరణి కి సర్పంచ్ తన నెల వేతనాన్ని అందించారు.ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను శాలువాలతో సన్మానించారు ఈసందర్భంగా సర్పంచ్ ఎగ్యారపు లింబాద్రి మాట్లాడుతూ గణతంత్ర వేడుకల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థికి నెల జీతాన్ని అందించినట్లు,100 శాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ,రాబోయే రోజుల్లో విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. పంచాయతీ కార్యదర్శి వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ పది ఫలితాల్లో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు, వారి విజయానికి కారకులైన ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేసారు.ఇంటర్ లో మంచిగా చదివి రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, మాజీ సింగిల్ విండో చైర్మన్ బద్దం నర్సారెడ్డి, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు బద్దం.సుధాకర్ రెడ్డి,నాయకులు మామిడి రాజ శేఖర్ రెడ్డి, నిగ.రవి, ఎగ్యరపు రాకేష్,బద్దం. వెంకట్ రెడ్డి, సురకంటి.సంతోష్,గంగరాజం,ఉపాధ్యాయులు,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
