నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:
మల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. నేరుగా కూలీలను కలిసి పనుల ప్రాముఖ్యతను వివరిస్తూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉపాధి కల్పనకై జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చారని వివరించారు. పని ప్రదేశాలలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారం గురించి తెలుసుకున్నారు. వీరి వెంట వార్డు సభ్యులు ముష్కరి రమేష్,ఫీల్డ్ అసిస్టెంట్ రామ నవీన్, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి ఉన్నారు.