ఎంపీ ధర్మపురి అరవింద్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు
అర్వింద్ వ్యాఖ్యల పై కాంగ్రెస్ నేత కల్లేడ నరేష్ మండిపాటు నవగీతం, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఎంపీ అర్వింద్ మతి భ్రమించి, అహంకారంతో మాట్లాడుతున్నారని టీపీసీసీ ఫిషర్మెన్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి కల్లేడ నరేష్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై ఎంపీ అర్వింద్ చేసిన అహంకారపూరిత విమర్శలను...