ఎడ్యుకేషన్ వీక్‌లో ఆరోగ్యానికి పెద్దపీట
జేఎన్‌టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాలలో హెల్త్ క్యాంప్ నిర్వహణ నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ వీక్–2026 కార్యక్రమాలు కొడిమ్యాల మండలంలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం నాచుపల్లిలోని జేఎన్‌టీయూహెచ్. యూనివర్సిటీ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ జగిత్యాల కళాశాలలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ హెల్త్ క్యాంప్‌కు బోధన, బోధనేతర సిబ్బంది విశేషంగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ పి. జితేందర్, డాక్టర్ పి.శివాని సిబ్బందికి బీపీ పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించి ఆరోగ్య...