navageetam.com
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 4:34 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఎస్ ఎస్ సి టాపర్లను సత్కరించిన సర్పంచ్ డొల్ల రమేష్ రెడ్డి

నవగీతం,వేల్పూర్ ప్రతినిధి:

వేల్పూర్ మండలంలోని మోతే గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో 500 పై మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులను మోతే సర్పంచ్ డోల్లా రమేష్ రెడ్డి ఘనంగా సత్కరించారు. పాఠశాలలో మొదటి ర్యాంక్ సాధించిన కే శృతిక కు రూ.5000/- రూపాయలు, రెండవ ర్యాంకు సాధించిన బ్లేస్సి మరియు విద్య లకు చెరి ఒక్కొక్కరికి  రూ.2500/- రూపాయలను క్యాష్ ప్రైజ్ గా , సర్పంచ్ డోల్ల రమేష్ రెడ్డి అందజేశారు. అంతేకాకుండా 500 పై మార్కులు సాధించిన విద్యార్థులందరికీ శాలువా, పూలదండలతో, సత్కరించి ప్రశంసా పత్రాలను క్యాష్ ప్రైస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రమేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు 10వ తరగతి పునాది లాంటిదని ,దీనిలో మంచి మార్కులు సాధించి, మొదట మెట్టు పూర్తి చేసి కళాశాల విద్య లో ఇంకా కష్టపడి చదివి మోతే గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొని రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పరంజ్యోతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్, పి ఆర్ టి యు ప్రధాన కార్యదర్శి నరసింహారావు, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్  భూదేవి, వి డి సి స్పీకర్లు ద్యాగ రాజన్న, కల్లా రాజేందర్, విడీసీ సభ్యులు ప్రవీణ్, మనోహర్ రెడ్డి, వార్డ్ మెంబర్లు, ఉపాధ్యాయులు మంచి గణేష్ ,మహేందర్, రత్నయ్య, శ్రావణ శ్రీ, సురేష్ ,వెంకట నరసయ్య, మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.